Friday, May 6, 2011

అంబేద్కర్ ఆలోచనలు దేశానికి స్ఫూర్తి .

                   అంబేద్కర్ ఆలోచనలు దేశానికి స్ఫూర్తి .  బారత దేశంలోని సామాజిక న్యాయశక్తులను ఉత్జేంపజేస్జూన్నాయి. ఆచరణకు పురిగొల్పుతూనే ఉన్నాయి. భారతదేశం గర్వించదగ్గ మేధావిగా, రాజనీతిజ్ఞుడిగా, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో విద్వాంసుడిగా, అన్నిటికి మించి భారతసమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి,
అంబేద్కర్ ఆలోచనలు దేశానికి స్ఫూర్తి ...

ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు.....

              ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు ఏంటని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా స్పందించడానికి కారణమైన కుల దురహంకార హత్యలె.  మన రాష్ట్రంలో కూడా  ( ఆంధ్రప్రదేశ్‌లోనూ) అక్కడక్కడ   ఈ పాశవిక సంఘటనలు జరుగుతున్నాయి. 
                తక్కువ కులం వ్యక్తిని (దళితున్ని) పెళ్లి చేసుకున్న కారణంగా కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా, పాశవికంగా దాడి చేసి, హత్య చేశారు.  దూరంగా  ఖాలీ  ప్రాంతానికి తీసుకెళ్లిన ఆమె తల్లి, మానమేమలు... రాళ్లతో కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.  అటు మానవత్వానికి, ఇటు మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో  బాలానగర్‌ మండలం రాజాపూర్‌ (జాతీయ రహదారి పక్కనున్న గ్రామం)లో  చోటుచేసుకుంది.  గొర్రెల పెంపకందారుల సామాజిక తరగతికి చెందిన మాధవి(18), కేశంపేట మండలం కాకునూరు గ్రామానికి చెందిన దళితుడు లింగం గత ఏడాది నవంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దళితున్ని పెళ్లి చేసుకోవడం మింగుడు పడని మాధవి తల్లి శంకరమ్మ తన బిడ్డకు మైనార్టీ తీరలేదని, లింగం కిడ్నాప్‌ చేశాడనే ఆరోపణతో బాలానగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లింగంను రిమాండ్‌కు పంపి మాధవిని స్టేట్‌ హోమ్‌లో ఉంచారు. అనంతరం రెండు నెలల్లోనే జడ్చర్ల మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌, మాధవి మైనార్టీ తీరిందని చెప్పి హోమ్‌ నుండి తీసుకొచ్చారు. అక్కడి నుండి నేరుగా భర్త లింగం దగ్గరకు మాధవి వెళ్లింది. మాధవి అక్కడికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని తల్లి, మేనమామలు గురువారం కసాయిమూకల ఘోరకలి సంఘటన జరిగింది