Thursday, April 14, 2011

అంబేద్కర్ ఆలోచనలు దేశానికి స్ఫూర్తి...

నేడు  (14 .04 .2011 ) బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ జయంతి.

                  అంబేద్కర్ ఆలోచనలు దేశానికి స్ఫూర్తి .  బారత దేశంలోని సామాజిక న్యాయశక్తులను ఉత్జేంపజేస్జూన్నాయి. ఆచరణకు పురిగొల్పుతూనే ఉన్నాయి. భారతదేశం గర్వించదగ్గ మేధావిగా, రాజనీతిజ్ఞుడిగా, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో విద్వాంసుడిగా, అన్నిటికి మించి భారతసమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి, ఉన్నతీకరించడానికి తపనపడ్డ దార్శనికుడు.  అస్పృశ్యుల గురించి, అస్పృశ్యత, కులవ్యవస్థ, సామాజిక న్యాయం గురించి ఆయన మాట్లాడినవారు . స్వాతంత్య్రపోరాటం దగ్గరనుంచి రాజ్యాంగ రచన ప్రక్రియ దాకా- భారతీయ సమాజాన్ని, రాజకీయాలను సామాజిక కోణం నుంచి నిశితపరిశీలన చేసి నారు.

                  అంబేద్కర్ ఆలోచనలు ఈనాడు ఎంతగా వ్యాపించినా, బలపడినా- దేశంలో ఇంకా దళితులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి,  అవమానాలకు గురిఅవుతున్నాయి. సానుకూల వివక్ష ద్వారా దళితులకు కొంత ప్రయోజనం కలుగుతున్నప్పటికీ, దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా వారి సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతున్నది.  ( పత్రికల సహాకరంతొ.....) 

No comments:

Post a Comment